ఈటలకు నోటీసులు

ఈటలకు నోటీసులు

  • పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లి.. తాఖీదులు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్‌ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. 160 సీఆర్​పీసీ కింద నోటీసులు అందించారు.

ఈటల రాజేందర్‌ పీఏలు రాజు, నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు నోటీసులపై ఈటల రాజేందర్​ స్పందించారు. విచారణకు రావాలని పోలీసులు నుంచి నోటీసులు అందాయని.. తమ న్యాయవాదులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *