
- 10 th పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ లభించింది - హనుమకొండ మెజిస్ట్రేట్ ఆయనకి ₹ 20,000
పూచీ కత్తుతో షరతులతో కూడిన
బెయిల్ మంజూరు చేసింది. - నిన్న సంజయ్ కు 14 రోజులు
రిమాండ్ విధించడంతో ఆయనను
కరీంనగర్ జైలుకు తరలించారు. - బిజెపి లీగల్ సెల్ టీం సంజయ్ తరఫున
హనుమకొండలో బెయిల్ పిటిషన్ వేసింది. - దీనిపై సుదీర్ఘంగా విచారించిన మెజిస్ట్రేట్
బెయిల్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది. - రేపు ఉదయం కరీంనగర్ జైలు నుంచి
విడుదల కానున్న బండి సంజయ్., - బండి సంజయ్ కు బెయిల్
రావడంతో బిజేపి పార్టీ శ్రేణులు హర్షం
వరంగల్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కేసులో బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ హనుమకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్ పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు తో పాటు రూ 20 వేల డిపాజిట్ తో బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.