జమ్మికుంట సిఐ బదిలీ

జమ్మికుంట, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణా సీఐ కె. రామచందర్రావు మండల ప్రజల మన్ననలు పొందిన అధికారిగా గుర్తింపు జమ్మికుంట పట్టణ సీఐ గా విధులు నిర్వహిస్తూ కె. రామచంద్రరావు సాధారణ బదిలీపై జగిత్యాలకు బదిలీ అయినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మికుంట పట్టణ సిఐ గా కె. రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఆఫీసర్ గా జమ్మికుంట మండలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పైరవీలకు తావు లేకుండా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు తనదైన శైలిలో న్యాయం చేస్తూ ఎంతోమందిని బాధితుల సమస్యలను పరిష్కరించిన మంచి అధికారిగా కె. రామచంద్రరావు గుర్తింపు తెచ్చుకున్నారు. తను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేటు కూడా చాలా తక్కువగా నమోదు కావడం గమన హర్వం ప్రజలతో ప్రతినిత్యం మమేకమై వారి సమస్యలను సానుకూలంగా వింటూ సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా ప్రయత్నం చేసి మండల ప్రజల మండల మన్ననలు పొందిన అధికారిగా గుర్తు తెచ్చుకున్నారు. జమ్మికుంట సిఐ కె రామచంద్రరావు బదిలీ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు అయ్యా సార్ బదిలీపై వెళ్తున్నారా అంటూ బాధపడం కనిపించింది. పోలీస్ స్టేషన్కు వచ్చే చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా న్యాయం వైపు నిలబడి అందరికీ సమానంగా న్యాయం చేసే అధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలాంటి అధికారులు ఎప్పుడో ఒకప్పుడు వస్తారని స్థానిక ప్రజలు చర్చికుంటున్నారు.