విద్యార్థి డిబార్ను రద్దు చేయండి

  • కమలాపుర్ డిబార్ ఐన విద్యార్థి విషయంలో చంపుతానంటే 10 th పరీక్షలు రాసే ఒక మైనర్ బాలునికి (సుమారు 16 ఇయర్స్)
    బయం ఉండదా?
  • విద్యార్థి న్యాయం కోసంస్పందించని కే.సీ.ఆర్, కె.టి.ఆర్, బండి, MLC కౌశిక్ రెడ్డి, MLA ఈటెల
  • డిబార్ ఐన విద్యార్థి ని కలిసిన బల్మూరి వెంకట్ (కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి – NSUI రాష్ట్ర అధ్యక్షులు ) విద్యార్థికి అడ్వకేట్ ను ఏర్పాటు చేసి న్యాయపోరాటం చేస్తానని బరోసా ఇచ్చారు.
  • విద్యార్థి కోసం లాయర్ లక్ష్మణ్ కేటాయించిన బల్మూరి వెంకట్ఈ రోజు కోర్టు ముందుకు వెళ్తున్న విద్యార్థి డిబార్ విషయం.

క‌మ‌లాపూర్‌, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : ప్రశ్నపత్రాల లీక్ లో ఐదు సంవత్సరాల పాటు డిబార్ చేసిన విద్యార్థి డిబార్ ను వెంటనే రద్దు చేయాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖలో డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లికేజ్ విషయంలో మరోసారి మీడియాకు లేఖ విడుదల చేసిన ఆయన లికేజ్ విషయంలో బండి సంజయ్, కేసీఆర్లను ముందుగా శిక్షించాలన్నారు.

బీజేపి, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ లబ్ది కోసం విద్యార్థులను బలి పశువును చేస్తున్నారని, పేద మైనర్ విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రశ్న పత్రాల లీకులకు పాల్పతున్నారు. అమాయక విద్యార్థులను బెదిరించి వారి వద్ద నుండి బలవంతంగా ప్రశ్న పత్రాలను లాక్కొని వారి జీవితాన్నే నాశనం చేశారని జగన్ లేఖలో ఆరోపించారు. నీచ రాజకీయాల కోసం ప్రశ్న పత్రాలను లీక్ చేసినా అసలు సూత్ర దారులు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసిఆర్లను శిక్షించకుండా అమాయక విద్యార్థిని 5 సంవత్సరాలు డిబార్ చేసి భవిష్యత్ ను చిద్రం చేస్తున్నారని అన్నారు.

విద్యార్థి డిబారన్ను రద్దు చేసి సీఎం కేసిఆర్, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లను వెంటనే శిక్షించాలన్నారు. అధికారం కోసం విద్యార్థులను బలి పశువులు చేసే రాజకీయ నాయకులను శిక్షించే వరకు విద్యార్థులు, వారి తల్లి దండ్రులంతా ఐక్యమై పోరాడాలని జగన్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *