దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా బహిరంగపరచాలి

దళిత బంధులో అవినీతికి పాల్పడిన
ఎమ్మెల్యేల చిట్టా బహిరంగపరచాలి

MRPS మేడ్చల్ జిల్లా కన్వీనర్ పంగ ప్రణయ్ కుమార్
బోడుప్పల్, మే 1 (విశ్వం న్యూస్) : దళిత బంధు పథకంలో లబ్ధిదారుల వద్ద రూ 2 నుండి 3 లక్షల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ముందు వెంటనే బహిరంగపరచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పంగ ప్రణయ్ కుమార్ డిమాండ్ చేసారు.

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎమ్మార్పీఎస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు బండారి సాయి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో పంగ ప్రణయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో అవినీతిలేని పాలనను అందిస్తామని, కన్నా కొడుకు తప్పు చేసినా సహించేది లేదని మాట్లాడిన కేసీఆర్ ,BRS ఎమ్మెల్యేలు అత్యంత పేద వాళ్ళు అయిన దళితుల నుండి 3 లక్షలు లంచం తీసుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవినీతి ఎమ్మెల్యేల చిట్టా ఉందని మాట్లాడుతున్న కేసీఆర్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుండా కేవలం హెచ్చరిక చేసి వదిలేయడమంటే వారి అవినీతిని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని అన్నారు.

తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధులో అవినీతి చేసిన ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని దళిత సమాజం భావిస్తుందని అన్నారు.కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎమ్మెల్యేల చిట్టాను తెప్పించుకోవాలని అన్నారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు తీసుకున్న డబ్బులను తిరిగి లబ్ధిదారులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

దళిత బంధు లో ఎమ్మెల్యేల జోక్యాన్ని తగ్గించి దళితులకు న్యాయం చేయాలని అన్నారు.అలాగే ఇప్పటి వరకు దళితబంధును విడతల వారిగా అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.రెండవ విడతగా దళిత బంధును ఇప్పటికి లబ్ధిదారులకు అందించలేకపోయిందని అన్నారు. కేసీఆర్ ఇచ్చేది స్వల్పం అందులో ఎమ్మెల్యేలు అవినీతి చేయడం నీతిమాలిన చర్య అని అన్నారు.అవినీతి లేకుండా దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళితులను మోసం చేస్తూ ,అణచివేస్తూ మరో వైపు సెక్రెటరియట్ కు డా. బి ఆర్ అంబేద్కర్ పేరు పెడుతూ దళితోద్ధారాకుడు ప్రచారం చేసుకోవడం కేసీఆర్ మోసపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.

కనుక అవినీతికి పాల్పడుతున్న BRS ప్రభుత్వ వైఖరిని దళిత ప్రజలు గమనించి రాజకీయంగా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే చిట్టా బయటపెట్టేంత వరకు పోరాటం ఆగదని, మే 2 నుండి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేపడతామని, మే 10 న వేలాది మందితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ మాదిగ ,గద్దల రవి, దీపక్ మాదిగ, శివ, సంపత్, లక్ష్మణ్, ప్రవీణ్, అజయ్, మనోజ్, సతీష్, కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *