నటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

నటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

చెన్నై, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్) : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. స్వస్థలం విశాఖ. డ్రస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ సమకూర్చేవారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్‌ బంద్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయమయ్యారు.

ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ అవకాశం రావడం వెనుక ఓ కథ ఉంది. కృష్ణ ఇంటి పైన ఆఫీసులో దర్శకుడు కోడి రామకృష్ణ ఉండేవారు. ఆయనే పిలిచి మూడు రోజులు వేషం వేయమని అడగడంతో… అయిష్టంగా ఓకే చెప్పారు.

అల్ల‌రి మొగుడు, పెళ్లం చెబితే వినాలి, కొండ‌ప‌ల్లి రాజా, మామా బాగున్నావా, విల‌న్‌, మా ఆయ‌న బంగారం, శాంభ‌వి ఐపీఎస్ తో పాటు ఎన్నో సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. చిరంజీవి, వెంక‌టేష్, బాల‌కృష్ణ‌తో పాటు స్టార్ హీరోలంద‌రి సినిమాల‌కున‌టుడిగా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *