Today TrendingVishwam Newsతెలంగాణహైదరాబాద్

తెలంగాణకు అలర్ట్‌..

  • మూడు రోజులపాటు
    వడగళ్ల వానలు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌, మేడ్చల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, జిల్లాల్లో బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో వడగళ్లవాన కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి వడగళ్ల వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *