సి.బి.ఎస్.ఇ 10వ, 12 వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విజయభేరి

సి.బి.ఎస్.ఇ 10వ, 12 వ తరగతి
ఫలితాల్లో అల్ఫోర్స్ విజయభేరి

కరీంనగర్ బ్యూరో, మే 12 (విశ్వం న్యూస్) : శుక్ర వారం ప్రకటించిన సి.బి.ఎస్.ఇ 10వ , 12వ తరగతి ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి జాతీయస్థాయిలో ప్రతిభ చాటారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి.నరేందర్రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో 10వ , 12వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ అల్ఫోర్స్ అన్ని రంగాలలో ముందంజలో ఉన్నదని చెప్పాడానికి ఏటువంటి అతిశయోక్తి లేదని అత్యుత్తమ విద్యను అందించడములో అల్ఫోర్స్ సాటి ఏవరులేరని గర్వంగా చెప్పారు. అందుకు నిదర్శనం వివిధ పరీక్షా ఫలితాలలో జాతీయస్థాయి , రాష్ట్రస్థాయి మార్కులను సాధిస్తున్నదని చెప్పారు.

10 వ తరగతి ఫలితాలు :
జె.వామిక 500 మార్కులకు గాను 495 మార్కులతో రాష్ట్రస్థాయి కీర్తిని సాధించినదని, ఎన్.అనిరూద్సాయి 492, బి.శ్రీహిత 487, ఏ. శివాశ్రిత 487 మార్కులు, 73 మంది విద్యార్థులు 450 కి పైగా మార్కులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు.

12 వ తరగతి ఫలితాలు :
పి. వేదవిష్ణు 500 మార్కులకు గాను 486 మార్కులు, డి. అశ్వితరెడ్డి 484, షికారి చందన 478, అర్. సూహాసిత 473, నిషాంత్పర్వల్ 471 , 30 పై విద్యార్థులు 400 కు పైగా మార్కులు సాధించడం ఒక గొప్ప అధ్యాయమని సంతోషం వ్యక్తంచేశారు.

జాతీయస్థాయిలో ప్రశంషానీయ ఫలితాలను సాధించిన విద్యార్థులందరికి ఘనంగా సన్మానం చేశారు. ఈ అఖండ విజయాలకు చేయూతను ఇచ్చిన తల్లిదండ్రులకు , అహర్నిశలు కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *