బండి భగీరథ్‌పై మరో కీలక సెక్షన్ నమోదు

బండి భగీరథ్‌పై మరో కీలక సెక్షన్ నమోదు

  • పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు.. కేసులో BNS 64(2)(M) సెక్షన్ జత

హైదరాబాద్, మే 18 (విశ్వం న్యూస్):బండి భగీరథ్‌పై నమోదైన కేసులో పోలీసులు మరో కీలక సెక్షన్‌ను జత చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) 64(2)(M) సెక్షన్‌ను నమోదు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్న పోలీసులు, తాజాగా సేకరించిన వివరాలు మరియు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఈ కొత్త సెక్షన్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. ఈ సెక్షన్ ప్రకారం ఒకే బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ అయితే కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.

నేరం రుజువైతే బండి భగీరథ్‌కు పదేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. బండి భగీరథ్ అరెస్ట్, విచారణ, కొత్త సెక్షన్ల నమోదు నేపథ్యంలో కేసు మరింత కీలక మలుపు తిరిగినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *