ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..మే 13న

- మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి.
హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెలువరించింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముఖ్య తేదీలు
నోటిఫికేషన్ జారీ 18-04-2024
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 25-04-2024
నామినేషన్ల పరిశీలన 26-04-2024
ఉపసంహరణకు చివరి తేదీ 29-04-2024
పోలింగ్ తేదీ 13-05-2024
ఓట్ల లెక్కింపు 04-06-2024
