ఇన్సూరెన్స్ కోసం అత్త హత్య

  • ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్త హత్య చేసిన అల్లుడు – సిద్ధిపేటలో దారుణం

సిద్ధిపేట, జూలై 12 (విశ్వం న్యూస్): సిద్ధిపేట జిల్లా తోగుట మండలంలో నరహింసలా మారిన అల్లుడు తన అత్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూలై 7న తుక్కాపూర్ దర్గా వద్ద జరిగిన ఈ దారుణానికి కారణం కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే.

వివరాల్లోకి వెళితే.. వెంకటేష్ అనే వ్యక్తి తన అత్తను హత్య చేయించేందుకు రూ.1.50 లక్షల సుపారీ ఇచ్చి, కారుతో ఢీకొట్టించి చంపించాడు. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి ఎవరూ అనుమానం పొందకుండా పక్కా ప్లాన్ రూపొందించాడు. అయితే, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసును పరిశీలించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అల్లుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేష్ పౌల్ట్రీ ఫారమ్‌లో పెట్టుబడి పెట్టి రూ.22 లక్షల నష్టపోయాడు. ఆ నష్టాల నుంచి బయటపడేందుకు అత్త పేరుపై పోస్టాఫీసు, ఎస్‌బీఐ, రైతు బీమాలుగా మొత్తం రూ.60 లక్షల ఇన్సూరెన్స్ చేశాడు. ఆ తర్వాత పొలం పనుందని చెప్పి అత్తను బయటకు తీసుకెళ్లాడు.

ఈ హత్యకు స్ఫూర్తి ‘దృశ్యం-2’ సినిమా అని పోలీసులు వెల్లడించారు. సినిమాలోని మాదిరిగా రోడ్డు ప్రమాదంలా హత్యను మలచాడు. అయితే పోలీసుల నిశిత దర్యాప్తుతో అసలైన కథ బయటపడింది. ప్రస్తుతం వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర సంచలనం రేగింది. కనుక్కునే కుటుంబ సభ్యుడే హంతకుడయ్యాడన్న వార్త ప్రజలను షాక్‌కు గురి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *