జమ్మికుంట కొత్త మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

- కొత్త కమిషనర్ శ్రీనివాస్ కు ఘనంగా స్వాగతం పలికిన మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి , సీనియర్ మున్సిపల్ ఉద్యోగి సంపత్ రావు
జమ్మికుంట, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గా బిర్రు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంత క్రితం ఇకడ పని చేసిన కెంసారపు సమ్మయ్య గత నెల మార్చి 14 నుండి సెలవులలో ఉండగా హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ఎస్.సమ్మయ్య ను జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ తో బాధ్యతలు స్వీకరించారు.
దీర్ఘకాలంగా సెలవులలో ఉన్న కే.సమ్మయ్య ను సి. డి.ఎం. ఏ కు సరెండర్ చేయడం వలన జయశంకర్ భూపాల్ పల్లి కమిషనర్ గా ఉన్న బిర్రు శ్రీనివాస్ ను జమ్మికుంట కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. గురువారం జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గా ఫుల్ అడిషనల్ ఛార్జ్ తో ఉన్న ఎస్.సమ్మయ్య నుండి బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ కమిషనర్ బిర్రు.శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కి తోడ్పడుతానని అలాగే పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు బోకె ఇచ్చి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఉద్యోగులు సంపత్ రావు, పాషా, వాణి, చంద్రకళ, సదానందం, సమ్మయ్య, ప్రభాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.