బండ్లగూడ జాగీర్:రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం

రూ.20 లక్షల వ్యయంతో
సీసీ రోడ్డు ప్రారంభోత్సవం

  • బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా ఏడు కోట్ల 34 లక్షల 70 వేల నిధులతో అభివృద్ధి : కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

బండ్లగూడ జాగీర్, జూన్ 17 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో రూ. 20 లక్షల వ్యయంతో విద్యానగర్ వై జంక్షన్ నుండి భీమా విష్ణుపురి కాలనీ వరకు శనివారం నాడు సీసీ రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ ప్రారంభించారు.

సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా.. తలారి చంద్రశేఖర్ మాట్లాడుతూ… మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్ మహేంద్ర గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్లు సహాయ సహకారాలతో నిరుపేదల ఉన్నటువంటి జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం మరియు 60 గజాల వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్నందున మున్సిపల్ కార్పొరేషన్ లోనే అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతున్నది.

కాలనీలో ఏలాంటి సమస్య ఉన్న నన్ను కలవాలని సూచించారు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా ఏడు కోట్ల 34 లక్షల 70 వేల నిధులతో అభివృద్ధి చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *