
కమలాపూర్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా, హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యలపై చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్రలో మండుటెండలను, వర్షాలను సైతం లెక్కచేయకుండా నడుస్తూ 400 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న మహాపాదయాత్ర.

నిరంతరం నడుస్తూ, 39వ రోజు హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రం నుండి వరంగల్ అర్బన్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం మీదుగా వర్ధన్న పేట నియోజకవర్గం వర్ధన్నపేట మండలంలో విజయవంతంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్ర లో కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.