తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జ్ : బీఎం సందీప్

తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జ్ : బీఎం సందీప్
విశ్వం న్యూస్, హైదరాబాద్, 14 నవంబర్ 2026 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయనకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చింది.

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన బీఎం సందీప్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జాతీయ స్థాయిలో పలు సంస్థాగత బాధ్యతలు నిర్వహించారు. ఇకపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం వంటి బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.
మరోవైపు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆమె సేవలను కాంగ్రెస్ అధిష్ఠానం అభినందించింది. ఈ మార్పుతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త సంస్థాగత బాధ్యతల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లయింది.