హైదరాబాద్

గంధంగూడ కాదు… దుర్గంధంగూడ!

గంధంగూడ కాదు… దుర్గంధంగూడ!


విశ్వం న్యూస్ (రాజేంద్రనగర్ మండలం): రాజేంద్రనగర్ మండలం గంధంగూడ ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం భారీగా పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న చెత్త కుప్పల నుండి వెలువడుతున్న తీవ్ర దుర్వాసనతో ఈ ప్రాంతం “గంధంగూడ కాదు… దుర్గంధంగూడ” అన్నట్లుగా మారిందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జీహెచ్ఎంసీ (GHMC) 123వ వార్డు అధ్యక్షులు తలారి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.


రహదారిపై ఎక్కడపడితే అక్కడ పడేసిన ప్లాస్టిక్ కవర్లు, ఆహార వ్యర్థాలను మూగజీవాలు (గేదెలు) తింటూ తీవ్ర అనారోగ్యం పాలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కడుపులోకి వెళ్లడం వల్ల పశువుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.


పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తలారి రమేష్ మండిపడ్డారు. ప్రాంతంలో అంటురోగాలు ప్రబలకముందే అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మరియు నిరంతరం పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

oplus_0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *