ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
గోవిందరావుపేట, జనవరి 2 (విశ్వం న్యూస్) : మండల వ్యాప్తంగా సోమవారం ముక్కోటి ఏకాదశి పండుగ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. చల్వాయి పసర గోవిందరావుపేట గ్రామాల్లోని పలు దేవాలయాలు భక్తుల సందోహంతో నిండిపోయాయి. పలు దేవాలయాల్లో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం మరియు రుద్రాభిషేకాలు అర్చనలు అనంతరం గోవిందరాజుల స్వామికి పూజాకార్యక్రమాలు జరిగాయి. ఉదయం 4 గం.ల నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. గోవిందరాజుల స్వామి ఆలయంలో ఉదయ భాస్కర స్వామి బోల్లేపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో సంతోష చార్యులు శ్రీ కోదండ రామాలయంలో అచ్యుత రామయ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పసర పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ సిహెచ్ కరుణాకర్ రావు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
