జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి : ప్రొఫెసర్ రామ్ చందర్

- కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామ్ చందర్
- ముగిసిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు
- విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టు
వరంగల్, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : సాఫ్ట్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచందర్ కోరారు. వరంగల్ నగర శివారులోని బొల్లి కుంటలో గల వాగ్దేవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ క్రీడా మైదానంలో హనుమకొండ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కె రామ్ చందర్ పాల్గొని మాట్లాడారు. క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ క్రీడాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సాఫ్ట్బాల్ క్రీడాభివృద్ధి కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఉమ్మడి వరంగల్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరపున ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి.సాంబశివరావు, ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శోభన్ బాబు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా కేంద్రంలో త్వరలోనే జాతీయస్థాయి పోటీలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు ఈ పోటీల్లో హైదరాబాదు జట్టు విజేతగా నిలిచిందని తెలిపారు రెండవ మూడవ స్థానంలో మెదక్, రంగారెడ్డి జట్లు నిలిచాయని తెలిపారు అనంతరం విజేతలకు ట్రోఫీలను, ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన బ్యాట్స్మెన్ ఫీల్డర్ విభాగాలకు ప్రత్యేక బహుమతులను ప్రధానం చేశారు ఈ సందర్భంగా కేయూ రిజిస్టార్ ప్రొఫెసర్ కె రామచందర్ ను , డాక్టర్ పి. సాంబశివరావు ను, శోభన్ బాబును శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ నవీన్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్, ఇండియన్ కోచ్ కృష్ణ, కేఎంసి సూపరిండెంట్ ప్రమోద్ కుమార్, వరంగల్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పూజారి అశోక్ బాబు, భూపాల్ పల్లి సెక్రటరీ అభినవ్ వినయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు రాజేశ్వర్, నాగరాజు, సుమలత, వినయ్, మధు, సృజన, రవి, శశాంక్, ప్రశాంత్, భగత్, లక్ష్మీపతి, నరేష్, అర్జున్, సుష్మ, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.