మంత్రి గంగులను ఫోన్లో ఫోన్ లో పరామర్శించిన సీఎం కెసిఆర్

మంత్రి గంగులను ఫోన్లో ఫోన్ లో పరామర్శించిన సీఎం కెసిఆర్

మంత్రి గంగుల కమలాకర్ కు పితృవియోగం
కరీంనగర్, జనవరి 4, (విశ్వం న్యూస్) : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) గారి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గారు, బుధవారం కరీంనగర్ లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ గారు మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు, విచారం వ్యక్తం చేశారు. తండ్రి ని కోల్పోయిన బాధలో వున్న గంగులను సిఎం కెసిఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుండె పోటుతో మృతి చెందారు. క్రిస్టియన్ కాలనీ లోని స్వగృహంలో మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు అందులో మంత్రి గంగుల చిన్న కుమారుడు. తండ్రి మృతితో మంత్రి గంగుల ఇంట విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *