నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి

అంబర్ పేట, జనవరి 23 (విశ్వం న్యూస్) : బాగ్ అంబర్పేట్ డివిజన్ వైభవ్ నగర్ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి డ్రైనేజ్ సూపర్వైజర్ లక్ష్మణ్ కలిసి డ్రైనేజీ మాన్యువల్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వైభవ్ నగర్ కాలనీలో సీజన్స్ హాస్పిటల్ వీధిలో సి.సి రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడం వలన ఆసుపత్రికి వచ్చి పోయే వారికి మరియు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కావున సి.సి రోడ్డుపనులను వెంటనే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ మ్యానువల్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టి బాలరాజ్, మిరియాల శ్రీనివాస్, గుగ్గిళ్ళ శ్రీనివాస్ పాల్గొన్నారు.