స్కూల్ బస్సు ఢీ కొని ప్రాణాలు కోల్పోయిన 8 ఏళ్ళ చిన్నారి దీక్షిత

హైదరాబాద్, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తండ్రి చిన్నారితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుంత రావడంతో బ్రేక్ వేశాడు. ఈ సమయంలో వెనుక నుంచి స్పీడ్‌గా వస్తున్న స్కూల్ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో చిన్నారి ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ క్రమంలో కిందపడిన చిన్నారిపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో జరిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో దీక్షిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డుపై ఉన్న గుంతలకారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *