తొమ్మిదవ డివిజన్ లో
గడప గడపకు కాంగ్రెస్

- అలకాపురి లో అస్తవ్యస్తంగా మురికి కాలువల నిర్మాణం:నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : తొమ్మిదవ డివిజన్ లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను తెలియజేస్తూ పాదయాత్ర చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదవ డివిజన్ లో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఒకవైపు డంప్ యార్డ్ దుర్వాసన మరోవైపు మురికి కాలువలు అస్తవ్యస్థంగా ఉన్నాయని అన్నారు.నేల స్వభావాన్ని బట్టి రోడ్లు మురికి కాలువలు నిర్మించకపోవడం వల్ల వేసిన కొద్ది రోజులకే కుంగి పోవడమో కూలి పోవడమో జరిగి ప్రజాధనం వృధా అవుతుందని నరేందర్ రెడ్డి అన్నారు.

డంప్ యార్డ్ వల్ల పొగ దుర్వాసన తో పాటు బోర్లల్లో కలుషిత నీరు వచ్చి చేరుతున్నాయని ప్రజలు వాపోతున్నారని కోమటిరెడ్డి అన్నారు. స్మార్ట్ సిటీ లో భాగంగా ప్రధానంగా రద్దీ ఉన్న కోతిరాంపూర్ కూడలి వద్ద బస్ స్టాండ్ నిర్మించలేదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గడప అజయ్,గంగుల దిలీప్ కుమార్, చర్ల పద్మ,గడ్డం విలాస్ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పొరండ్ల రమేష్, దన్న సింగ్, చంద్రయ్య గౌడ్, నెల్లి నరేష్, కుర్ర పోచయ్య, ఖమ్రొద్ధిన్, నాగుల సతీష్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, ఊరడి లత, అన్నే జ్యోతి, మెతుకు కాంతయ్య, వంగల విద్యాసాగర్, మహమ్మద్ భారీ, ముక్క భాస్కర్, చర్ల పవన్, ఉప్పరీ అజయ్, బషీర్, సలేమొద్ధిన్, ఇమ్రాన్, మామిడి సత్యనారాయణ రెడ్డి, సిరజొద్దిన్, ఇమామ్, హనీఫ్,యోనా తదితరులు పాల్గొన్నారు.