మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
వరంగల్ బ్యూరో, పిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. గోవిందరావు పేట మండలం చాల్వాయి గ్రామానికి చెందిన గనపాక సారయ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తస్లీమా సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సారయ్య మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందించి సహృదయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.
