Today TrendingVishwam Newsజాతీయంతాజా వార్తలుతెలంగాణ

అతిక్రూరమైన దాడులకు.. ప్రతి దాడి మాత్రమే

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : దండకారణ్య అటవీ ప్రాంతంలో ప్రభుత్వ బలగాలు జరుపుతున్న దాడులకు నిరసనగానే అరన్ పూర్ ఘటనకు పాల్పడ్డామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది.

సౌత్ సబ్ జోన్ అధికార ప్రతినిధి సమత పేరిట చత్తిస్ గడ్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ దాడికి పాల్పడింది పి.ఎల్.జి.ఏ నని వెల్లడి చేశారు. ఆ ఘటనకు ఒకరోజు ముందు ప్రభుత్వ బలగాలు విచక్షణా రహితంగా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి 17 మంది గ్రామస్తులను కొట్టి అరెస్ట్ చేశారని సమత వివరించారు. ఇలాంటి ఘటనలను నివారించటానికే అరన్ పూర్ వద్ద జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి వేసినట్లు వివరించారు.

ఇతర ఉద్యోగాలలో చేరండి.
మావోయిస్ట్ ఇతర ఉద్యోగాలలో చేరండి అని మావోయిస్ట్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. తమ ఎత్తుగడలను పసిగట్టి పై ఎత్తులు వేస్తున్న పోలీసుల వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తుంది. పోలీస్ ఉద్యోగాలు తప్ప ఇతర ఏ ఉద్యోగాల్లో ఐనా చేరండి అని సమత విజ్ఞప్తి చేశారు.

ఇతర శాఖల్లో నియామకాల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రమే నిర్వహిస్తుందని ఆరోపించారు. దాంతో విధిలేక తమ కుటుంబాలను పోసించు కోవటానికి నిరుద్యోగులు పోలీస్ విభాగంలో చేరుతున్నారని అభిప్రాయపడ్డారు.

ఆ సంఘటనలే కారణమా ..?
ఇటీవల కాలంలో చత్తిస్ గడ్ లో డి.అర్.జి బస్తర్ ఫైటర్స్ పేరిట దండకారణ్య అటవీ ప్రాంత యువతకు ఉపాధి కల్పించే దిశగా ఛత్తీస్ గడ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా బస్థర్ అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీ యువత ఉపాధి పొందేందుకు ప్రభుత్వం చూపిస్తున్న మార్గం వైపుగా అడుగులు వేస్తుంది.

ఇటీవల కాలంలో పూర్వ బస్తర్ ఏడు జిల్లాలలో రిక్రూట్మెంట్ ప్రక్రియ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టు లకు, బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల ఘటన లప్పుడు, మందు పాతర పేల్చి వేతలప్పుడు అదే అటవీ ప్రాంతం ఆదివాసులు కూడా మరణిస్తున్నారు.

ఇటు మావోయిస్టుల తరుపున అటు ప్రభుత్వ బలగాల తరుపున ప్రత్యక్ష యుద్ధం చేస్తూ చనిపోతున్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీ బిడ్డలే ఉంటున్నారు. బుధవారం దంతెవాడ జిల్లా అరన్ పూర్ సమీపంలో పెడ్కా వద్ద జరిగిన మందు పాతర పేల్చి వేతలో 11 మంది మరణించారు. ఆ ఘటనలో చనిపోయిన 10 మంది డి.అర్.జి జవాన్లు ఆదివాసీ బిడ్డలే కావడంతో మావోయిస్ట్ పార్టీ అప్రమత్తం అవుతున్నట్లుగా అర్థం అవుతుంది.

బస్తర్ అటవీ ప్రాంతానికి చెందిన ఆదివాసీలే మరణిస్తుండటం ప్రమాదమని భావించిన మావోయిస్ట్ పార్టీ వ్యూహాత్మకంగా పోలీస్ ఉద్యోగాలలో యువత చేరవద్దని పిలుపు ఇస్తున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *