అధ్వానంగా డ్రైనేజీ సిస్టం

హుజరాబాద్, జూలై 27 (విశ్వం న్యూస్) : హుజరాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు 15వ వార్డులో నాగేశ్వరరావు పరిసర ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఆ వాటర్ ఎటు వెళ్లలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఇండ్లలోకి వచ్చేసి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది.
వాటికి ఎదురుగా ఉన్న అక్రమ కట్టడాలు మరియు లేఔట్ లేకుండా నిర్మిస్తున్న ఇళ్లతో ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళన చేపడుతామని ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వారు తెలిపారు.

అదే విధంగా 13 వ వార్డులో రాచపల్లి సరూప అనేటువంటి దళిత మహిళ వారి గృహ ఇంటి ఇల్లు మొత్తం కూలిపోయి శిథిలావస్థలో రాత్రంతా ఆ వర్షపు నీటిలో ఉండే దయనీయ పరిస్థితిని కూడా వారు పరిశీలించడం జరిగినది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇంతవరకు వారికి నిరుపేద కుటుంబాలకు ఇవ్వకపోవడమే ఈ దయనీయ పరిస్థితికి కారణమని తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసి వారికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, కాంగ్రెస్ నాయకులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, కోడెం నర్సింగ్ ,రియాజ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.