విద్య-వైజ్ఞానిక శిక్షణ తరగతులను
జయప్రదం చేయండి:ఎస్ఎఫ్ఐ

ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్
మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : ఈనెల 29 30న భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజకీయ, విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని శనివారం పట్టణ కేంద్రంలోని బానోతు సింహాద్రి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గుగులోతు సూర్య ప్రకాష్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తు, విద్యా కాషాయకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు.. శాస్త్రయ విద్యా విధానం కోసం అందరికీ సమాన విద్యా కావాలని భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ క్లాసులలో భవిష్యత్ పోరాటాలు, నిర్మాణం,శిక్షణ తరగతులు ఇవ్వబడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి, మురళి, విష్ణు, రాహుల్, నితిన్, వినోద్, సునీల్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.