జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అంబాల ప్రభు, ఎగిత అశోక్
మెదక్, జనవరి 22 (విశ్వం న్యూస్) : మెదక్ లోని ఇందిరా స్టేడియంలో గత రెండు రోజుల పాటు జరిగిన 11 వ తెలంగాణ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో సుమారు 2000 మంది పోటీలలో క్రీడాకారులు పాల్గొన్నారు. 45+ ఏజ్ గ్రూప్ లో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ ( ప్రభు ) జావేలీన్ త్రో లో మొదటి స్థానం సాధించిన బంగారు పతకం, హైమర్ త్రో లో తృతీయ స్థానం సాధించి కాంశ్య పతకం రాష్ట్ర ఇప్కో డైరెక్టర్ పద్మ దేవేందర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ శాశ్వత అధ్యక్షులు మర్రి లక్ష్మ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
అదే విధంగా అబాది జమ్మికుంట కు చెందిన ఎగిత అశోక్ హైమర్ త్రో లో మొదటి స్థానం సాధించి బంగారు పతకం అందుకున్నారు. వీరిద్దరు హరియాణా రాష్ట్రంలోని కురిక్షేత్ర లో ఫిబ్రవరి 16 నుండి 19 జరిగే జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యా. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కౌన్సిల్ మెంబర్స్ ప్రభు కుమార్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరి జాతీయ స్థాయి కి ఎంపిక పట్ల హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు అన్ని వర్గాల సకల జకనులు హర్షం చేశారు.