ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన
పెద్దపల్లి, జనవరి 22 (విశ్వం న్యూస్) : ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ట్రినిటీ ప్రైమరీ పాఠశాలలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ షైన్ హాస్పిటల్ వారి సహకారంతో మల్టీ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ రోజు మెగా వైద్య శిబిరంలో పరిసర గ్రామాలు నుండి పెద్దసంఖ్యలో ప్రజలు వైద్య సేవల కోసం తరలివచ్చారు. ఈ మెగా క్యాంపుకు మొత్తం 1056 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. ఇందులో 294 మందికి రోగ నిర్దారణ పరీక్షలు, 48 మందికి డెంటల్ పరీక్షలు 127 మందికి ఈ.సి.జీ పరీక్షలు, 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 136 మందికి 2డి ఎకో అందించడం జరిగింది. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కార్డియాలజీ, ఆర్తో గైనకాలజీ, డెంటిస్ట్, ఎండి ఫిజీషియన్, ఆస్తమాలజిస్ట్, ఐ స్పెషలిస్ట్, జనరల్ క్రిటికల్ కేర్ ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య దృశ్య యొక్క ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క శిబిరంలో పెద్దపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి భారీగా ప్రజలు పాల్గొనడం జరిగిందని ఇప్పుడున్న తరుణంలో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ పెద్దపల్లి కి వచ్చి వారి సేవలు అందించడం హర్షించే దగ్గ విషయమని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నామని ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరంలో వెయ్యి మందికి పైగా ప్రజలు వివిధ రకాల పరీక్షలు చేయించుకోవడం జరిగిందని రోగనిధారణ పరీక్షలు అనంతరం డాక్టర్స్ రాసిన మందులు ఉచితంగా అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఇంత చక్కటి ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సన్ షైన్ హాస్పిటల్ వారికి మరియు మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజింగ్ టీం ని అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమంలో సన్ షైన్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీకాంత్ రామ్మోహన్, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ రాజేందర్, మైథిలి, డాక్టర్ కిరణ్, డాక్టర్ గ్రీష్మ, హెల్త్ క్యాంప్ ఆర్గనైజింగ్ టీం డాక్టర్ అశోక్ కుమార్, లైసెట్టి బిక్షపతి, చొప్పరి వంశీ, డాక్టర్ అజీజ్ మోబిన్ ,ఉప్పు రాజు, పెంచాల శ్రీధర్, పైడా రవి, చంద్రశేఖర్, స్వామి, రమాదేవి, ఫహిముద్దీన్, చంద్రమౌళి, కొయ్యడ సతీష్ గౌడ్, వెన్నం రవీందర్, కాశిపాక వాసు, పిటి షఫీ మరియు ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.