ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

ఘనంగా మాజీ స్పీకర్
శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ చౌరస్తా వద్ద అన్నదానం
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీపాద రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బస్ స్టాండ్ చౌరస్తా వద్దగల శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నగారిగారి ప్రీతమ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా అందరి మన్ననలు పొందడమే కాకుండా మారుమూల మంథని నియోజక వర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి శ్రీపాద రావు అని కొనియాడారు. నిరాడంబరతకు నిజాయితీకి నిలువుటద్దం శ్రీపాద రావు అని అన్నారు. వారి ఆశయాలను శ్రీధర్ బాబు కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలుగా వారి అడుగుజాడలలో నడుస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, కుర్రపోచయ్య, సయ్యద్ అఖిల్, షబానా మహమ్మద్, మామిడి సత్యనారాయణ రెడ్డి, కమురుద్దీన్, బొబ్బిలి విక్టర్, నిహాల్ అహ్మద్, వంగల విద్యాసాగర్, కొర్వి అరుణ్ కుమార్, పోరండ్ల రమేష్, బాల బద్రి శంకర్, ముక్క భాస్కర్, సలిమొద్దిన్, సుంకరి గణపతి, నాగుల సతీష్, దిలీప్ కుమార్, దండి రవీందర్, దన్ను సింగ్, షహేన్షా, ఏజ్రా, అబ్దుల్ బారి, కాంపెళ్లి కీర్తి కుమార్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కుంభాల రాజ్ కుమార్, ముల్కల కవిత, ఎస్ డి అజ్మత్, పరదాల లింగమూర్తి, హనీఫ్, కమల్, సోహెల్, జాఫర్, షాహిద్ శారద లింగన్న, రవీంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *