అసిస్టెంట్ కమాండెంట్ గా ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రదీప్

అసిస్టెంట్ కమాండెంట్ గా ఎంపికైన
ఎక్సైజ్ కానిస్టేబుల్ కొమిరె ప్రదీప్

తిమ్మాపూర్, జూన్ 9 (విశ్వం న్యూస్) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల ఎంపిక పరీక్షలో ( సిఎపిఎఫ్) ఆల్ ఇండియా ర్యాంక్ 89 తో అసిస్టెంట్ కమాండెంట్ గా సిరిసిల్ల జిల్లా ముష్టిపల్లికి చెందిన కొమిరె ప్రదీప్ 89వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమాండెంట్ గా ఎంపికయ్యారు. ఇతను కరీంనగర్ జిల్లాలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేసి, ఇటీవలే ఎయిర్ ఫోర్స్ లో స్టోర్ సూపరిండెంట్ గా జాయిన్ అయ్యాడు.

ఇటీవల విడుదలైన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల పరీక్షలో అసిస్టెంట్ కమాండెంట్ గా ఎంపికైన సందర్బంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిష నర్ ఏ. విజయ్ భాస్కర్ రెడ్డి ప్రదీప్ ను ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చిన్న వయసులోనే, ఎక్సైజ్ కాని స్టేబుల్, ఎయిర్ ఫోర్స్ లో స్టోర్ సుపరిండెంట్, అసిస్టెంట్ కమండెంట్ గా, అల్ ఇండియా 89 వ ర్యాంకు సాధించటం చాలా గొప్ప విషయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ తాతాజీ, ఎస్సై చిరంజీవి , హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షులు పులి నగేష్ గౌడ్, కిషన్, మోసిన్, శ్రీనివాస్ యుగెందర్, కుమార స్వామి, అశోక్, కృష్ణకాంత్, శ్రీనివాస్, శ్రీకాంత్ లతో పాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *