బండ్లగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

బండ్లగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

బండ్లగూడ, జూన్ 9 (విశ్వం న్యూస్): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, స్థానిక ప్రజలకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, నార్సింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ కలర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ పార్టీ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు డప్పు నవీన్, రాజారామ్, మదర్ వలి, రాజు, కృష్ణ సాగర్, హరీష్ గౌడ్, కొరవి గణేష్, సాగర్ గౌడ్, సురేష్ గౌడ్, మాజీ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, హామున్ కాజా డైరెక్టర్ సాదిక్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కార్యక్రమానికి హాజరై అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తలారి ప్రేమ్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *