అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు

జమ్మికుంట పట్టణంలోని సర్వే పీపుల్స్ ఫౌండర్ రాస మల్ల శేఖర్ ఆధ్వర్యంలో
జమ్మికుంట, మే 22 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని గత రెండు రోజుల క్రితం జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఎండ తీవ్రతకు గుర్తు తెలియని వృద్ధురాలు జమ్మికుంట రైల్వే స్టేషన్లో చనిపోయారు. వృద్ధురాలి మృతదేహం రైల్వే పోలీసులు జమ్మికుంటలోని స్వచ్ఛంద సేవ సంస్థ అయిన సర్వే పీపుల్స్ ఆర్గనైజేషన్ సభ్యుల సహకారంతో జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్ లో భద్రపరచడం జరిగింది.

మృతురాలకు సంబంధించిన వారు ఎవరు ముందుకు రాకపోవడంతో అనాధ శవంగా గుర్తించి రైల్వే పోలీసు వారు జమ్మికుంటలోని స్వచ్ఛ ధన సేవా సంస్థ అయినా సర్వే పీపుల్స్ ఫౌండర్, రాస మల్ల శేఖర్, (టీం), అనాధ శవానికి దహన సంస్కారాలకు నిర్వహించారు. రాస మల్ల శేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.