తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు
ఐఆర్ మధ్యంతర భృతి ఇప్పించండి

- తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు రాజేందర్ జనరల్ సెక్రెటరీ మారం జగదీశ్వర్ లకు తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రిప్రజెంటేషన్ ద్వారా విజ్ఞప్తి
- బుధవారం రోజు హైదరాబాద్ పట్టణంలో నాంపల్లి తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ భవనములో తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ సంఘ అధ్యక్షుడు రాజేందర్ జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ నన్ను కలిసిన సందర్భంలో…
హైదరాబాద్, జూలై 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో రెండవ పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు రాజేందర్ జనరల్ సెక్రెటరీ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సిఎస్ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మద్యంతర భృతి ఇప్పించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ సంఘం అధ్యక్షులు రాజేందర్ జనరల్ సెక్రెటరీ మారం జగదీశ్వర్ లను కలిసిన సందర్భంలో వారిని టీసీ టీఎన్జీఎస్ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది.

ఈ సందర్భంలో రాజేందర్ జగదీశ్వర్ లకు శాలువాలతో పుష్పగుచ్చాలతో సన్మానించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర జిల్లాల నుండి వచ్చిన వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులతో రాజేందర్ జగదీశ్వర్ మాట్లాడుతూ మా దృష్టికి ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినచో ఆ సమస్యల పరిష్కారం కొరకు టీఎన్జీవో సంఘం ముందుండి ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంది అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర టీఎన్జీవోస్ సంఘానికి ఎంతో మంచి గుర్తింపు ఉందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.
ఇప్పుడు ఉద్యోగులు కోరుకునే సమస్యలు సాధారణ బదిలీలు రెండవ పిఆర్సి కమిషన్ ను వెంటనే వేయించడానికి తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవో సంఘం ముందుండి రెండో పే రీజన్ కమిషన్ కమిటీని వేయించడానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ టీఎన్జీవో సంఘం నాయకులకు తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలిసిన నాయకులు ఎస్కే జలాల్, జి ప్రభాకర్, గోపికృష్ణ, ప్రవీణ్ కుమార్, మొహమ్మద్ ముజీబ్, శ్రీనివాస్, శ్రీకాంత్, మహమ్మద్ జమీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.