ప్రగతి భవన్ లో ఘనంగా
వినాయక చవితి వేడుకలు

హైదరాబాద్, (విశ్వం న్యూస్) : సోమవారం వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. గణనాథుడుకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు.


గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో .. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి .. ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
