ఘనంగా సరస్వతి పూజ

ఘనంగా సరస్వతి పూజ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విశ్వం న్యూ స్) : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలోని గణేశుని మండపంలో శ్రీ సరస్వతి పూజా కార్యక్రమం ఆలయ కమిటీ సౌజన్యంతో, చింతపల్లి శోభా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మొదట బేబీ గూడూరి తరుణీ రెడ్డి అక్షరాభ్యాసంతో మొదలై విచ్చేసిన మిగతా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అశేషంగా హాజరైన పిల్లలకు భగవంతుని సన్నిధిలో అక్షరాభ్యాసం నేర్పడం శుభ పరిణామమని పిల్లల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు.

ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు భగవంతుని ప్రసాదంతో పాటు పిల్లలకు నోటుబుక్కులు, పెన్సిళ్లు, పెన్నులు, ఇచ్చి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రములో BK.G. విజయలక్ష్మి, బి .కే .కళావతి, అనురాధ, రాధిక జి. మహేందర్ రెడ్డి, బేబీ తరుణి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జి. శ్రీనివాస్ vice president, G.మహేందర్ రెడ్డి youth president, డి. రవి గౌడ్ Treasurer, G.అనుష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *