రంగరంగా వైభవంగా ప్రారంభమైన
వినాయక నవరాత్రులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విశ్వం న్యూ స్) : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఈరోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సౌజన్యముతో, స్నేహితం ట్రస్ట్ ఆధ్వర్యంలో చింతపల్లి శోభా రెడ్డి. నూరాస్ సంగీత అకాడమీ వారి చేత నిర్వహించబడిన కార్యక్రమం” శ్రోతలను 2.30 గంటల పాటు భక్తి పరవశ్యములో ముంచినా అకాడమీ బృందం మ్యూజిక్ డైరెక్టర్ GR నరేన్ మరియు వారి సతీమణి శ్రీమతి రజిని నరేన్ గార్ల తో పాటు వారి బృందానికి మెమొంటోలతో పాటు శాలువాలు కప్పి సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రములో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ డా. గూడూరి చెన్నారెడ్డి, డా.BK.విజయలక్ష్మి, KHS శర్మ, జి. శ్రీనివాస్, D.రవి గౌడ్, జి. మహేందర్ రెడ్డి, బండి కళ్ళు శ్యామ్ ప్రసాద్, C.వెంకట దాస్, రేణుక రెడ్డి, బేబీ తరుణి రెడ్డి, జి. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.