బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

జమ్మికుంట, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ కార్యాయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ ‘స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలో అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్స్ మేనేజర్ భూపాల్ రెడ్డి, మరియు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.