
హైదరాబాద్, జూలై 14 (విశ్వం న్యూస్) : హైదరాబాద్: నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతినగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట వర్షం కురిసింది.
బోరబండ, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్, అమీర్‌పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, లక్డికపూల్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్, కృష్ణాపూర్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులపై వరద నీరు పొంగిపొర్లింది.
జీహెచ్ఎంసీ హెచ్చరిక
భారీవర్షం కురవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరసమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరికలు జారీచేశారు. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040-21111111, 9000113667 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.