హైదరాబాద్‌:బట్టతలపై జుట్టు-పాతబస్తీకి ఎగబడ్డ యువకులు!

హైదరాబాద్‌:బట్టతలపై జుట్టు
పాతబస్తీకి ఎగబడ్డ యువకులు!

హైదరాబాద్‌, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : బట్టతల సమస్యతో బాధపడుతున్న యువకులకు వెంట్రుకలు మొలిపిస్తాననే ఆశ చూపి మోసం చేసిన సంఘటన పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది. ఫతే దర్వాజ ప్రాంతంలో ‘బిగ్‌బాస్ సెలూన్’ నిర్వహిస్తున్న షకీల్‌ భాయ్‌ అనే సెలూన్‌ ఓనర్‌ నకిలీ ప్రచారంతో వందలాది మంది యువకులను తమను తాము మోసపోవడానికి అనుమతించుకునేలా చేశాడు.

తన సెలూన్‌లో ప్రత్యేకమైన కెమికల్‌ ఉందనీ, దాన్ని ఉపయోగిస్తే బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయని షకీల్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడు. ఢిల్లీకి చెందిన ఓ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు జుట్టు మొలిపించానని చెబుతూ కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నాడు. వీడియోలు, ఫొటోలు వైరల్‌ కావడంతో హైదరాబాద్‌ యువత భారీగా స్పందించారు.

వెంట్రుకల ఆశలో ఫతే దర్వాజ వద్ద ఉన్న సెలూన్‌కు వందల మంది యువకులు చేరుకున్నారు. షకీల్‌ భాయ్‌ వారిని ఒక్కొక్కరిని గుండు గీసి, తన కెమికల్‌ రాసి పంపించాడు. అయితే, ఆ కెమికల్‌ రాసిన కొద్ది నిమిషాల్లోనే గుండు ప్రాంతాల్లో మంటలు, వాపు, నొప్పి మొదలయ్యాయి. కొన్ని గంటల్లోనే తలనొప్పి, అలర్జీ వంటి తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడంతో యువకులు లబోదిబోమంటూ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది.

ఇప్పటికే ఈ ఘటనపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షకీల్‌ భాయ్‌ నకిలీ కెమికల్స్‌ వినియోగించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటంాడాడన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించగా, మున్సిపల్‌ అధికారులు సెలూన్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *