2 కోట్లతో మాడ్రన్ ధోభీ గాట్

2 కోట్లతో మాడ్రన్ ధోభీ గాట్

  • స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేస్తున్న మాడ్రన్ ధోభీ గాట్ పనులను పరిశీలించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మాడ్రన్ దోభీ గాట్స్ ఏర్పాటు వల్ల రదకుల కష్టాలు, ఇబ్బందులు తీరుతాయని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా 34 వ డివిజన్ గోదాంగడ్జ ధోభీ గాట్ ను కమీషనర్ సేవా ఇస్లావత్, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేస్తున్న మాడ్రన్ ధోభీ గాట్ పనులను తనిఖీ చేసి పరిశీలించారు.

ధోభీ గాట్ నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం ధోభీ గాట్ లో కృలవృత్తి పనులు చేస్తున్న కొంతమంది రజకులను కలిసి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాడ్రన్ ధోభీ గాట్ నిర్మాణం తో పనులు సులభతరం అవడంతో పాటు ఇబ్బందులు, కష్టాలు తీరుతాయని రజకులకు విన్నవించారు. త్వరలోనే ధోభీ గాట్ నిర్మాణం పనులు పూర్తి చేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ ఫలాలను అందిస్తుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ… అన్ని కులాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని తెలిపారు. ఇందులో బాగంగానే రజకులకు మాడ్రన్ దోభీ గాట్స్ నిర్మాణం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. 142 అర్బన్ లోకల్ బాడీస్ లో 142 మాడ్రన్ ధోభీ గాట్స్ నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

నగరపాలక సంస్థ ద్వారా స్మార్ట్ సిటీ లో మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సలహాల ప్రకారం రజకులకు మంచి అధునిక ధోభీ గాట్ నిర్మించాలనే ఉద్దేశంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో 2 కోట్లు కేటాయించి సకల సౌకర్యాలతో కూడిన మాడ్రన్ ధోభీ గాట్ ను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దోభీ గాట్ పనులు వేగవంతంగా కొనసాతున్నాయని పనుల్లో మరింత వేగం పెంచి వచ్చే 3 మాసాల్లో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. కుల వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న రజకులకు వేసవి, చలి, వర్షకాలాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మాడ్రన్ ధోభీ గాట్ ను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ ధోభీ గాట్ నిర్మాణం తో రజకులు ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రజకుల పట్ల ప్రేమను చూపించి కుల వృత్తిని ప్రోత్సహించేలా దోభీ గాట్ నిర్మాణం చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపినట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వం నూతనంగా సాంక్షన్ చేసిన 142 ధోభీ గాట్లలలో మరో దోభీ గాట్ కరీంనగర్ నగరపాలక సంస్థ కు సాంక్షన్ కావడం జరిగిందన్నారు. త్వరలోనే మరో చోట మరో ధోభీ గాట్ నిర్మాణం కు భూమీ పూజ చేసి పనులు ప్రారంబిస్తామని తెలిపారు. కరీంనగర్ నగరంల రెండు దోభీ గాట్స్ లలో కుల వృత్తి చేసే రజకులకు సకల సౌకర్యాలతో అధునిక ధోభీ గాట్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ స్వరూప రాణీ, ఎస్ఈ నాగమల్లేశ్వరావు, ఈఈ కిష్టప్ప, డీఈ మసూద్ అలీ, టీఆర్ఎస్ నాయకులు ఉయ్యాల శ్రీనివాస్, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *