కరీంనగర్రంగారెడ్డి

దళిత జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు, దళిత బంధు పథకం వర్తింపజేయాలి

దళిత జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు,
దళిత బంధు పథకం వర్తింపజేయాలి

  • కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు.. తెలంగాణ ఎస్సీ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

హైదరాబాద్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని, దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరేల్లి మల్లేష్ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామం వద్ద బస చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను బుధవారం ఉదయం కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను వారి ఆర్థిక పరిస్థితులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న వాటి గురించి మాట అయినా ఎత్తడం లేదని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నప్పటికీ, దళిత జర్నలిస్టులకు ప్రత్యేకంగా అమలు చేయడం లేదని బట్టి విక్రమార్క కు తెలిపారు. దళిత జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేదా ఇండ్లు ,డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని, దళిత బంధు పథకం వర్తింపచేయాలని కాంగ్రెస్ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తమవంతుగా కృషి చేయాలని కోరారు.

అందుకు బట్టి విక్రమార్క స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలు ఇవ్వాలని, దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం వర్తింప చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, దళిత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ పక్షాన పోరాడుతామని, వీలైతే రాబోయే అసెంబ్లీలో కూడా మీ విషయాన్ని లేవనెత్తుతానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *