
- జనాభాలో చైనాను అధిగమించిన భారత్.. అధికారికంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
హైదరాబాద్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్ , అధికారిక అంచనా వెల్లడించిన ఐక్యరాజ్యసమితి, ఐరాస ప్రకారం ప్రస్తుత భారత జనాభా 142.86 కోట్లు, చైనా జనాభా 142.57 కోట్లు చైనా కంటే 29 లక్షల జనాభా భారత్ లోనే అధికం.
చైనాలో చాలా కాలంగా జననాల రేటు భారీగా పడిపోయింది. జనాభా తగ్గిపోతూ, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయింది. పిల్లలను కనాలంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. అక్కడి ప్రజల్లో చాలా మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారత్ జనాభాలో నాలుగో వంతు 14 ఏళ్ల లోపు పిల్లలే. ఇక 68 శాతం జనాభా 15-64 ఏళ్ల వయసు మధ్యస్కులే కాగా, 65 ఏళ్లకు పైబడిన వారు 7 శాతం మంది ఉన్నారు.