జమ్మికుంట:క్విజ్ పోటీలను
సద్వినియోగం చేసుకోవాలి

ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఇమ్రాన్
జమ్మికుంట, మే 23 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనుసరించి తెలంగాణ యువశక్తిని మేల్కొలిపే దిశగా జూన్ రెండున రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలను నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ సోమవారం జమ్మికుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను అనుసరించి ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ, యువకులు వారి పేర్లను నమోదు చేసుకోవడానికి 7661899899 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి వారి వివరాలు నమోదు చేసి ఎన్రోల్ చేసుకోవాలని కోరారు.
నియోజకవర్గ స్థాయిలో మొదటి బహుమతులు స్మార్ట్ఫోన్, లాప్టాప్, ట్యాబ్లెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ప్రోత్సాహకంగా 40 బహుమతులలో పవర్ బ్యాంకులు, స్మార్ట్ వాచీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి టాపర్గా నిలిచిన మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీని బహుమతిగా ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఎన్ఎస్యూఐ నాయకులు అభిలాష్, పర్విస్, సబ్బని విశ్వ, మైహుద్, దురిశెట్టి శ్రీను, శేఖర్, విఘ్నేష్, మహేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.