గొడవపడి అసభ్యకర మాటలతో
వేధించిన వారిపై కేసు నమోదు

జమ్మికుంట, మే 23 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంట వద్ద సోమవారం రాత్రి బస్టాండ్ వద్ద ఉన్నటువంటి సిరాజుద్దీన్, s/o ఖాజా మొయినుద్దీన్ వయస్సు 18 సంవత్సరాలు అను అతడిని జమ్మికుంట పట్టణానికి చెందిన ఈశ్వర్ మరియు కొంతమంది అనవసరంగా గొడవ పెట్టుకుని బూతులు తిట్టి, కొట్టినారని ఫిర్యాదు చేయగా, సదరు ఈశ్వర్ మరియు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.