జమ్మికుంట:లింగ నిర్ధారణలతో విజయసాయి హాస్పిటల్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ రూమ్ సీజ్

జమ్మికుంట:లింగ నిర్ధారణలతో
విజయసాయి హాస్పిటల్ అల్ట్రా
సౌండ్ స్కానింగ్ రూమ్ సీజ్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా: లలితా దేవి
జమ్మికుంట, మే 15 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని విజయసాయి (డా: సురంజన్, డా: లావణ్య) హాస్పిటల్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఫ్రీ-కాన్సెప్షన్-ఫ్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (P.C.P.N.D.T)చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు నిర్వహిస్తున్నరని జమ్మికుంట మండల మెజిస్ట్రేట్ ఎం.అర్.ఓ రాజేశ్వరి సమక్షంలో విజయసాయి హాస్పిటల్ లోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ రూమ్ సీజ్ చేయడం జరిగింది.

అలాగే మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె తెలిపారు. విజయసాయి హాస్పిటల్ (డా: సురంజన్)పై చాలా పిర్యాదులు వచ్చాయని అవి నిజమని కొంత నిర్ధారణ అయింది కావున ఇంకా హాస్పిటల్ విషయంలో తగిన విచారణ చేస్తామని, శుభ్రత సరిగా కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా:లలితా దేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.అర్.ఓ రాజేశ్వరి, పట్టణ సి.ఐ రమేష్, డాక్టర్ వినీత, పి.ఓ.ఎం.సి హెచ్, రంగారెడ్డి డెమో, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *