Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

జీవితా రాజశేఖర్ లకు జైలుశిక్ష

  • పన్నెండేళ్ల తరువాత తీర్పు

హైదరాబాద్, జూలై 19 (విశ్వం న్యూస్) : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద జీవిత, రాజశేఖర్‌లు 2011లో కొన్ని కామెంట్లు చేశారు. దీంతో అల్లు అరవింద్ వారిద్దరి మీద పరువునష్టం దావా కేసు వేశారు. పన్నెండేళ్ల తరువాత ఇప్పుడు ఆ కేసులో తీర్పు వచ్చింది. బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారిద్దరికీ ఏడాది జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించారు. జైలు శిక్షను పై కోర్టులో సవాల్ చేయవచ్చని తెలుస్తోంది.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు. అయితే సినీ నటులు జీవిత, రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. 2011లో ఒక ప్రెస్ మీట్లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు.

ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలపైన, చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *