కరీంనగర్:ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి 10 లక్షల ఇవ్వాలి

కరీంనగర్:ప్రతి ఒక్క బీసీ
కుటుంబానికి 10 లక్షల ఇవ్వాలి

  • బీసీ కులవృత్తులకు ఒక లక్ష రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ప్రతి ఒక్క బీసీ కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీ సంఘాల డిమాండ్

కరీంనగర్ బ్యూరో, మే 23 (విశ్వం న్యూస్) : బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు చిగురుల శ్రీనివాస్ అధ్యక్షతన ప్రెస్ భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రకటించిన లక్ష రూపాయలు కుల వృత్తుల వారికి ఏ మేరకు సరిపోవు, బీసీలకు లక్ష రూపాయలు కాదు బీసీలకు బీసీ బందు పెట్టాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి హామీలను సబ్సిడీ రుణాలను మంజూరు చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదని ఇప్పుడు మళ్లీ బీసీల ఓట్ల కోసం లక్ష రూపాయల కుల వృత్తుల వారికి ఇస్తామనడం బీసీల పైన ఉన్న వివక్షను తెలియజేస్తుందన్నారు. కొన్ని కుల వృత్తులకు లక్ష రూపాయల మాత్రమే ప్రకటించి బీసీలను అవమాన పరుస్తున్నారని బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ కూడా బీసీలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఇప్పటికైనా ఈ వచ్చే ఎలక్షన్ల ముందే ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బీసీ సంఘాల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన్నారు.

లేనియెడల ప్రభుత్వం దిగివచ్చే వరకు బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామని ఎలక్షన్లు రాగానే మొదట బీసీలు గుర్తుకొస్తారు కానీ, బీసీల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు బీసీలను విస్మరించడం ఇక చెల్లవని బీసీలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారని తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పే రోజులు ముందున్నాయని గుర్తుంచుకోండని తెలిపారు.

బీసీలు తలుచుకుంటే గద్దె దించటం వచ్చు, గద్దెను ఎక్కించటం వచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొని శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పయ్యావుల మహేష్ , బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బొడిగే రాజేశం, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *