కరీంనగర్:నేడు గౌడ కులస్తుల
అధ్వర్యంలో పోచమ్మ బోనాలు
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా నేడు పోచమ్మ బోనాలు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో ఆదివారం గౌడ కులస్తులతో పోచమ్మ బోనాల ఉత్సవాల కార్యక్రమం ఉన్నందున గౌడ కులస్తులు ఉదయం 9:30 గంటల వరకు కోతి రాంపూర్ లో ఉన్న పోచమ్మ ఆలయానికి వారి వారి (ఎవరికివారుగా) బోనాల తో విచ్చేసి అందరి బోనాలను అమ్మవారికి సమర్పించాలి. అదేవిధంగా ఆలయ ఆవరణలో అమ్మవారికి పట్నం వేసే కార్యక్రమం ఉన్నందున గౌడ బాంధవులందరు అధిక సంఖ్యలో హాజరై పోచమ్మ బోనాల జాతర ఉత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీరేణుక ఎల్లమ్మ దేవి ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.

విజయ భాస్కర్ గౌడ్ రూ.20,000 విరాళం.
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల
ఉత్సవాలకు విరాళాల దాతలు.
మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల జాతర సందర్భంగా పంజాల సురేందర్ గౌడ్ వారి సోదరుడైన అడ్వకేట్ పంజాల విజయ భాస్కర్ గౌడ్ లు కలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి అమ్మవారి ఆలయానికి రూ. 20,000 లను విరాళంగా అందజేసినారు. అలాగే సాయి రత్న బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ తాబేటి పాపయ్య రూ.10,000 లను, సుదగొని కొండగట్టు స్వామి రూ.10,000 లను శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవ జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి విరాళంగా అందజేసినారని ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.

