సుప్రీంలో కవిత పిటిషన్..
3 వారాలకు వాయిదా

దిల్లీ, మార్చి 27 (విశ్వం న్యూస్) : కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. దిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ధర్మాసనం ట్యాగ్ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.