ఫీజులను తగ్గించాలని SFI ధర్నా

ఫీజులను తగ్గించాలని SFI ధర్నా

  • డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్

మహబూబాబాద్, మార్చి 27 (విశ్వం న్యూస్) : పెంచిన డిగ్రీ, పిజి పరీక్ష పిజులని తగ్గించాలని SFI డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గతంలో డిగ్రీ పీజీ కోర్సులు చేసిన విద్యార్థులకు బ్యాక్లాగ్ సబ్జెక్టు ఉంటే వారు ఆయా సబ్జెక్టులు పరీక్షలు రాసుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ప్రొఫెషనల్ మరియు నాన్ ప్రొఫెషనల్ కోర్సులు, సెమిస్టర్ సిస్టం, ఇయర్ వైస్ స్కీమ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ తదితర ఏ పరీక్షలోనైనా బ్యాక్లాగ్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటన ఇవ్వడం జరిగింది. 2022 – 2023, 2023 – 2024 విద్యా సంవత్సరంలో జరిగే ఆయా పరీక్షలకు బ్యాక్ లాక్ సబ్జెక్టులకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చునని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *